Tuesday 30 October 2012

కొన్ని

నేనొద్దు
నా మనసు వద్దనే వద్దు
నా ఊహలు నీ దరి చేరద్దు
మన జ్ఞాపకాలకి పెట్టావ్ హద్దు
ఇన్ని చెపుతున్నావ్
నా చుట్టూనే ఎందుకు తిరుగుతున్నావ్ !
ఓహో నీ మనసు ఇక్కడ బంధీ కదూ @ బాటసారి.

(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((

నీకు నేను కావాలి
నా మనసక్కర్లేదంటావ్ ,
ఆ మనసుకోసమేగా నువ్వే కావాలంటూ వెంటపడ్డావ్
మరిచే మనసు నీది
నీకై తపించే మనసు నాది @ బాటసారి .

)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))

నా కంటూ వేయి జన్మలివ్వి
అతివ మనస్తత్వాన్ని మనసుతో రాయడానికి
లేదంటే
ఆ చలాన్ని నాలోకి పంపు
కనీసం ఒక్క మనసునైనా తరచి విరచి రాయడానికి ...@ బాటసారి
 

కదా .....!!!

భాద్యతలంటే
బంధాలతో కూడిన అనుబంధాల ముడులే కదా
ఎవరికీ ఎవరూ సొంతంకారు
తెలిసికూడా ఏ రక్త సంబంధానికో , మానకికంగా అల్లిన శరీర బంధానికో
తుదిశ్వాస వరకూ తపిస్తూనే వుంటారు ,
నాకోసం కనీసం ఒకరైనా అని ఎదురు చూస్తూ .చూస్తూ .@ బాటసారి


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ఈ లోకంలో
ఎవ్వరో ఒకరు
ఎప్పుడో అప్పుడు
ఎక్కడో ఒకచోట నిన్నునిన్నుగా
ఇష్టపడతారు
మనసుతో ప్రేమిస్తారు ...
వదిలేవా పోయేది ఒక జీవితం
మరువకు నేస్తం @ బాటసారి


+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

మనసు తలుపు మూసి
గొళ్ళెం మరచి
నీకోసం వెతుకుతున్నానా
దొంగ! ఎప్పుడు దూరావో అలికిడి లేకుండా
నీకై రాసిన ప్రేమలేఖల సవ్వడి చెప్పె నీ రాకని ...
ఉండిపోరాదూ ఈ లేఖల నఖలు కానుకగా ఇస్తా ...@ బాటసారి
 

రాజకీయ సంత

రాజకీయ సంతలో
రంగుపూల కో గిరాకీ
వాసన ఇచ్చే పూలకి మరో గిరాకీ
రంగు వాసన గుభాలిమ్చే రంజు పూలకి యమగిరాకి @ బాటసారి

మనసు సవ్వడి

ఉప్పెనలా వచ్చే ప్రేమ నిను ముంచే లోపే !
చూసే ప్రతి దిక్కూ నీ పేరై పలవరిoచే లోపే !
కడసారి నా కళ్ళలో ప్రతిరూపం నీదయ్యె లోపే !
నీ మనసులో నా కింత చోటుందని చెప్పలేవా ? @ బాటసారి..

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ఒక్కనిజం చెప్పనా ?
నా గాలి కూడా సోకడం ఇష్టం లేదన్నావ్ గా
నీ శ్వాసలోనే నేనున్నా ..@ బాటసారి


^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

నీ మౌనం ఊ అంటే
నీ మాట పో అంటోంది
సర్లే పొమ్మంటూ నా మనసు సర్డుకుపోతోoది
పోనీలే అని నీ యదసవ్వడి వింటే ఉండిపో అని ఒత్తిడి చేస్తోంది ...@ బాటసారి


<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<

మాట్లాడాలని ఉందా !
నా మనసు చెబుతోంది నీ గుండె సవ్వడి అదేనని @ బాటసారి


>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

నీ కళ్ళు చూసేది
మనసుకి తెలుసు
మరి నీ మనసున దాగింది ?
నా హృదయంతో మాట్లాడితే కదా తెలిసేది ..! @ బాటసారి..


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నీవు నడిచే దారిలో
నా మనసు పూలు పరిచా
చూసి నీ కళ్ళు
నలిగి నా మనసు కార్చేవి కన్నీళ్ళే ...

నీ చెక్కిలిని తడిపే ఆ చెమ్మ విలువ
నలిగిపోతున్న నా మనసుకి తెలుసు
నీ మదికి తెలుసా
నలిగిపోతున్న నా మనసువిలువ ?..@ బాటసారి
 
 
 
 


 

నీ తలపుల్లో

నీ తలపుల్లో మునిగి పోతున్నా ,
నాదైన ప్రేమ నీదిగా చేసే రోజుకోసం వేచిచూస్తున్నా !
మనసుతలుపు తెరిచి నా ప్రేమకోమూల చోటివ్వరాదూ ! @ బాటసారి ..


############################################################

నీ మునుపంటి కింద నలుగుతున్న ఆ చూపుడు వేలు
నా హృదయాన్ని గుచ్చుతోం దేంటి
మాయ చేసేది కళ్ళా
నా హృదయమా ....@ బాటసారి


************************************************

తొందర పడకే మనసా
దాటేది నదైనా
ఎన్నో మొసళ్ళు ఆవురావురు మంటున్నాయ్
మాటలకే మైమరిస్తే
చేతలలో మత్తుకు గమ్మతవ్ తావ్....@ బాటసారి


####################################################### 

ఒక చిన్నది
నా తలపుల రెక్కలకి తాళంవేసి
నేనోచ్చే వరకూ ఎగురవద్దంటూ
మరలి వచ్చేదాకా మౌనమే కడుముద్దన్నది...!

పదాల చిగురుతిని
...

భావాల రాగానికి
వసంత గానం చేసే
నా తోటలోనే నన్ను బంధీ కమ్మన్నది @ బాటసారి .
 

Monday 22 October 2012

*** అయ్యా ? ***

అయ్యా శాస్త్రి గారు ..
రెడ్డిగారు ,
రాజుగారు,
నాయుడుగారు ...!

మనమంతా ఒకే తాను ముక్కలం
అమ్మ చనుపాలు సగపాలు రుచి చూసిన వాళ్ళం ..!

పొరపాటో,
గ్రహపాటో...
మంచి చేయాలనే తొందరపాటో
సమాజ మలినాన్ని మా ముక్కతో ఒక్కసారి కడిగాం ..!

అంతే !
అంటరాని వారిగా
అణగారిన వర్గాలుగా మిగిలిపోయాం
శతాబ్దాలుగా మీ సేవలోనే తరిస్తున్నాం ..!

అయ్య పెట్టిన పేరున్నా
రారా, పోరా, ఎరా, ఒరేయ్ లతో
సరిపెట్టుకుంటున్నాం , మట్టిలో మాణిక్యాలు
మాలో ఎందరున్నా ఇంకా నిరక్షరాశ్యులుగానే మిగిలిపోయాం..!

రాచరికాలు పోయినా
ప్రజాస్వామ్యానికి విలువలు అద్దినా
జీవచ్ఛవాలుగా వున్న మా నైతికతను
నూటికో కోటికో ఓ అంబేద్కర్ తట్టిలేపినా..!

ఏ వర్ధంతికో, జయంతికో
మా ఆవేశాన్ని పూలదండల్లో,
మీ తెల్లపంచెలు వేదికలెక్కి
మనమంతా ఒక్కటే అన్న మాటలతో
సర్దుకు పోతున్నాం , సమసమాజ ఉషోదయం కోసం ఎదురు చూస్తున్నాం...@ బాటసారి .

***మల్లెల రాతిరి***

అడుగులు తడబడుతూ
నెమ్మదిగా
కొంటె చూపుల ముద్దు మాటలు
పలకరింపు లేని చిలిపి నవ్వులు లోపలికి పొమ్మంటూ ..!

భిడియపడే ఆడతనాన్ని
తొలి రాతిరి సిగ్గు చీరతో సింగారించి
వేయలేని గడియముందు
వెళ్లక తప్పని, మనసు తెలియని మగని కోసం,

తెల్లచీరతో సుముఖమంటూ
వాల్చిన కనురెప్పల వాలు చూపులతో,
సిగ్గుతెరల సందుల్లోంచి
వణుకుతున్న పాలగ్లాసు అంచులు చూస్తూ ..!

నా రాక చూసాడో !
చూసి చూడనట్టు చూస్తున్నాడో ..
చెప్పమంటూ గాజులని
వణుకుతున్న లేత పెదవులని

ఇంతలో నన్ను తాకిన వెచ్చటి స్పర్శ
పందిరి మంచాన్ని అల్లిన పూలను కాదని
నాసిగలో మూరపూలు ముద్దని
మాటల గుస గుసని చీకటి సిగ్గుకు అందిస్తూ...!

ఈ మల్లెల రాతిరి
వెన్నల ఆటకి
రేతిరి అతిధిని ఆహ్వానిస్తూ
నిట్టూర్పుల ఆవిరిని మల్లెల పాన్పుకు విందులు చేస్తూ @ బాటసారి ..