Monday 22 October 2012

***మల్లెల రాతిరి***

అడుగులు తడబడుతూ
నెమ్మదిగా
కొంటె చూపుల ముద్దు మాటలు
పలకరింపు లేని చిలిపి నవ్వులు లోపలికి పొమ్మంటూ ..!

భిడియపడే ఆడతనాన్ని
తొలి రాతిరి సిగ్గు చీరతో సింగారించి
వేయలేని గడియముందు
వెళ్లక తప్పని, మనసు తెలియని మగని కోసం,

తెల్లచీరతో సుముఖమంటూ
వాల్చిన కనురెప్పల వాలు చూపులతో,
సిగ్గుతెరల సందుల్లోంచి
వణుకుతున్న పాలగ్లాసు అంచులు చూస్తూ ..!

నా రాక చూసాడో !
చూసి చూడనట్టు చూస్తున్నాడో ..
చెప్పమంటూ గాజులని
వణుకుతున్న లేత పెదవులని

ఇంతలో నన్ను తాకిన వెచ్చటి స్పర్శ
పందిరి మంచాన్ని అల్లిన పూలను కాదని
నాసిగలో మూరపూలు ముద్దని
మాటల గుస గుసని చీకటి సిగ్గుకు అందిస్తూ...!

ఈ మల్లెల రాతిరి
వెన్నల ఆటకి
రేతిరి అతిధిని ఆహ్వానిస్తూ
నిట్టూర్పుల ఆవిరిని మల్లెల పాన్పుకు విందులు చేస్తూ @ బాటసారి ..

No comments:

Post a Comment