Tuesday 30 October 2012

కొన్ని

నేనొద్దు
నా మనసు వద్దనే వద్దు
నా ఊహలు నీ దరి చేరద్దు
మన జ్ఞాపకాలకి పెట్టావ్ హద్దు
ఇన్ని చెపుతున్నావ్
నా చుట్టూనే ఎందుకు తిరుగుతున్నావ్ !
ఓహో నీ మనసు ఇక్కడ బంధీ కదూ @ బాటసారి.

(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((

నీకు నేను కావాలి
నా మనసక్కర్లేదంటావ్ ,
ఆ మనసుకోసమేగా నువ్వే కావాలంటూ వెంటపడ్డావ్
మరిచే మనసు నీది
నీకై తపించే మనసు నాది @ బాటసారి .

)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))

నా కంటూ వేయి జన్మలివ్వి
అతివ మనస్తత్వాన్ని మనసుతో రాయడానికి
లేదంటే
ఆ చలాన్ని నాలోకి పంపు
కనీసం ఒక్క మనసునైనా తరచి విరచి రాయడానికి ...@ బాటసారి
 

కదా .....!!!

భాద్యతలంటే
బంధాలతో కూడిన అనుబంధాల ముడులే కదా
ఎవరికీ ఎవరూ సొంతంకారు
తెలిసికూడా ఏ రక్త సంబంధానికో , మానకికంగా అల్లిన శరీర బంధానికో
తుదిశ్వాస వరకూ తపిస్తూనే వుంటారు ,
నాకోసం కనీసం ఒకరైనా అని ఎదురు చూస్తూ .చూస్తూ .@ బాటసారి


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ఈ లోకంలో
ఎవ్వరో ఒకరు
ఎప్పుడో అప్పుడు
ఎక్కడో ఒకచోట నిన్నునిన్నుగా
ఇష్టపడతారు
మనసుతో ప్రేమిస్తారు ...
వదిలేవా పోయేది ఒక జీవితం
మరువకు నేస్తం @ బాటసారి


+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

మనసు తలుపు మూసి
గొళ్ళెం మరచి
నీకోసం వెతుకుతున్నానా
దొంగ! ఎప్పుడు దూరావో అలికిడి లేకుండా
నీకై రాసిన ప్రేమలేఖల సవ్వడి చెప్పె నీ రాకని ...
ఉండిపోరాదూ ఈ లేఖల నఖలు కానుకగా ఇస్తా ...@ బాటసారి
 

రాజకీయ సంత

రాజకీయ సంతలో
రంగుపూల కో గిరాకీ
వాసన ఇచ్చే పూలకి మరో గిరాకీ
రంగు వాసన గుభాలిమ్చే రంజు పూలకి యమగిరాకి @ బాటసారి

మనసు సవ్వడి

ఉప్పెనలా వచ్చే ప్రేమ నిను ముంచే లోపే !
చూసే ప్రతి దిక్కూ నీ పేరై పలవరిoచే లోపే !
కడసారి నా కళ్ళలో ప్రతిరూపం నీదయ్యె లోపే !
నీ మనసులో నా కింత చోటుందని చెప్పలేవా ? @ బాటసారి..

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ఒక్కనిజం చెప్పనా ?
నా గాలి కూడా సోకడం ఇష్టం లేదన్నావ్ గా
నీ శ్వాసలోనే నేనున్నా ..@ బాటసారి


^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

నీ మౌనం ఊ అంటే
నీ మాట పో అంటోంది
సర్లే పొమ్మంటూ నా మనసు సర్డుకుపోతోoది
పోనీలే అని నీ యదసవ్వడి వింటే ఉండిపో అని ఒత్తిడి చేస్తోంది ...@ బాటసారి


<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<

మాట్లాడాలని ఉందా !
నా మనసు చెబుతోంది నీ గుండె సవ్వడి అదేనని @ బాటసారి


>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

నీ కళ్ళు చూసేది
మనసుకి తెలుసు
మరి నీ మనసున దాగింది ?
నా హృదయంతో మాట్లాడితే కదా తెలిసేది ..! @ బాటసారి..


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నీవు నడిచే దారిలో
నా మనసు పూలు పరిచా
చూసి నీ కళ్ళు
నలిగి నా మనసు కార్చేవి కన్నీళ్ళే ...

నీ చెక్కిలిని తడిపే ఆ చెమ్మ విలువ
నలిగిపోతున్న నా మనసుకి తెలుసు
నీ మదికి తెలుసా
నలిగిపోతున్న నా మనసువిలువ ?..@ బాటసారి
 
 
 
 


 

నీ తలపుల్లో

నీ తలపుల్లో మునిగి పోతున్నా ,
నాదైన ప్రేమ నీదిగా చేసే రోజుకోసం వేచిచూస్తున్నా !
మనసుతలుపు తెరిచి నా ప్రేమకోమూల చోటివ్వరాదూ ! @ బాటసారి ..


############################################################

నీ మునుపంటి కింద నలుగుతున్న ఆ చూపుడు వేలు
నా హృదయాన్ని గుచ్చుతోం దేంటి
మాయ చేసేది కళ్ళా
నా హృదయమా ....@ బాటసారి


************************************************

తొందర పడకే మనసా
దాటేది నదైనా
ఎన్నో మొసళ్ళు ఆవురావురు మంటున్నాయ్
మాటలకే మైమరిస్తే
చేతలలో మత్తుకు గమ్మతవ్ తావ్....@ బాటసారి


####################################################### 

ఒక చిన్నది
నా తలపుల రెక్కలకి తాళంవేసి
నేనోచ్చే వరకూ ఎగురవద్దంటూ
మరలి వచ్చేదాకా మౌనమే కడుముద్దన్నది...!

పదాల చిగురుతిని
...

భావాల రాగానికి
వసంత గానం చేసే
నా తోటలోనే నన్ను బంధీ కమ్మన్నది @ బాటసారి .
 

Monday 22 October 2012

*** అయ్యా ? ***

అయ్యా శాస్త్రి గారు ..
రెడ్డిగారు ,
రాజుగారు,
నాయుడుగారు ...!

మనమంతా ఒకే తాను ముక్కలం
అమ్మ చనుపాలు సగపాలు రుచి చూసిన వాళ్ళం ..!

పొరపాటో,
గ్రహపాటో...
మంచి చేయాలనే తొందరపాటో
సమాజ మలినాన్ని మా ముక్కతో ఒక్కసారి కడిగాం ..!

అంతే !
అంటరాని వారిగా
అణగారిన వర్గాలుగా మిగిలిపోయాం
శతాబ్దాలుగా మీ సేవలోనే తరిస్తున్నాం ..!

అయ్య పెట్టిన పేరున్నా
రారా, పోరా, ఎరా, ఒరేయ్ లతో
సరిపెట్టుకుంటున్నాం , మట్టిలో మాణిక్యాలు
మాలో ఎందరున్నా ఇంకా నిరక్షరాశ్యులుగానే మిగిలిపోయాం..!

రాచరికాలు పోయినా
ప్రజాస్వామ్యానికి విలువలు అద్దినా
జీవచ్ఛవాలుగా వున్న మా నైతికతను
నూటికో కోటికో ఓ అంబేద్కర్ తట్టిలేపినా..!

ఏ వర్ధంతికో, జయంతికో
మా ఆవేశాన్ని పూలదండల్లో,
మీ తెల్లపంచెలు వేదికలెక్కి
మనమంతా ఒక్కటే అన్న మాటలతో
సర్దుకు పోతున్నాం , సమసమాజ ఉషోదయం కోసం ఎదురు చూస్తున్నాం...@ బాటసారి .

***మల్లెల రాతిరి***

అడుగులు తడబడుతూ
నెమ్మదిగా
కొంటె చూపుల ముద్దు మాటలు
పలకరింపు లేని చిలిపి నవ్వులు లోపలికి పొమ్మంటూ ..!

భిడియపడే ఆడతనాన్ని
తొలి రాతిరి సిగ్గు చీరతో సింగారించి
వేయలేని గడియముందు
వెళ్లక తప్పని, మనసు తెలియని మగని కోసం,

తెల్లచీరతో సుముఖమంటూ
వాల్చిన కనురెప్పల వాలు చూపులతో,
సిగ్గుతెరల సందుల్లోంచి
వణుకుతున్న పాలగ్లాసు అంచులు చూస్తూ ..!

నా రాక చూసాడో !
చూసి చూడనట్టు చూస్తున్నాడో ..
చెప్పమంటూ గాజులని
వణుకుతున్న లేత పెదవులని

ఇంతలో నన్ను తాకిన వెచ్చటి స్పర్శ
పందిరి మంచాన్ని అల్లిన పూలను కాదని
నాసిగలో మూరపూలు ముద్దని
మాటల గుస గుసని చీకటి సిగ్గుకు అందిస్తూ...!

ఈ మల్లెల రాతిరి
వెన్నల ఆటకి
రేతిరి అతిధిని ఆహ్వానిస్తూ
నిట్టూర్పుల ఆవిరిని మల్లెల పాన్పుకు విందులు చేస్తూ @ బాటసారి ..

**** ఓయ్ ! నమ్మేదా ****

ఓయ్ !
వద్దంటే వినవ్
రావద్దు అంటే నేనంటే ఇష్టం లేదా
అని చిన బోతావ్ ..!

వచ్చాకా వుండనిస్తావా
తనువుని,
నిలువ నిస్తావా
నీదైన మనసుని...

ఎన్నో ఊసులతో చెంతకు వస్తావ్
నిన్ను చూడని క్షణాలు యుగాలు
నీతో వేయలేక అడుగులు
బయటకు పోలేదు ఇన్నాళ్ళు ..!

ఏవేవో అంటావ్ !
నమ్మేదా ? మనసు ఇచ్చేదా....

ఈ ఊసులన్ని
నా మనసు గదిలో దాచేసి
నీ గుండె గుడిలో దీపాన్నై
ప్రతి ఉదయం నా ప్రేమ హారతి నీ కళ్ళలో చూసుకోనా @ బాటసారి.

**** స్వేచ్చ****


స్వేఛ్చ
ఇచ్చేది కాదు
ఉరితాళ్ళు పెట్టి అణగత్రొక్కేది కాదు
ఒక నైతిక హక్కు

...
నా పిచ్చికాని !
రాతల్లోనో
రహదారికో మూల చేసే
ర్యాలీల్లోనో నీకుదొరికేదే స్వేఛ్చ... !

నీకు నిజమైన స్వేఛ్చ
కావాలంటే
పారిపో
ప్రపంచపు అంచులుదాటి
మనిషన్న మృగంలేని చోట
అతని సాంకేతిక పరిజ్ఞానం
నిన్ను తాకని చోట
దొరికేదే నీకు స్వేఛ్చ

ఈ ప్రజాస్వామ్య దేశంలో
స్వేఛ్చ స్వేఛ్చ అన్నావో
నిన్ను జీవచ్చవాన్ని చేసి,
నీ సమాధిపై
ఎర్రటి పూల అంతిమ యాత్రలో
నీకు దొరికేదే స్వేఛ్చ ....@ బాటసారి

Friday 12 October 2012

*** పరిచయం ***

ఎక్కడో ఒక చోట
ఎప్పుడో ఒకప్పుడు
అవసరానికో
అభిమానానికో మనతో మొదలయ్యా ఒక పరిచయం

నడుస్తూ
సాగుతూ
బంధమవ్వచ్చు,
అనుబంధంగా అల్లుకు పోవచ్చు

ఏదో ఒక మాట
తీయటి బాధై
మనసుని గుచ్చుతూ
ముఖాన్ని చాటేస్తూ

మొదటి పరిచయాన్ని కలగా
సాగించిన నడకని వెతగా
మరొక పరిచయం కోసం
మళ్లీ మనసు ఆశగా.. @ బాటసారి ..

నీ ఊహల్లో

బాటసారి *** నీ ఊహల్లో ***

నీలో ఏముందో
పెదాలు పలకని భావాలు
కళ్ళు చెప్పలేని ఊసులు
మనసు విప్పలేని బాసలు

అంతరంగం అందమైనదే
ఆవిష్కృతమయ్యే రూపమే
చిత్రంగా వుంది
మదిని ఛిద్రం చేస్తోంది...!

ఎదుట పడితే
ఎన్నడు చూడని బాటసారిలా
నా నీడను చూస్తూ
నన్ను గుచ్చే జ్ఞాపకంలా...

ఏంటోయ్ ఇది ! నీ ఊహలో
ఎన్నో సందెపొద్దులు,
వెన్నల రాత్రులు
దొర్లి పోతున్నాయ్...

నీ అడుగుల్లో అడుగేస్తూ
కళ్ళు రచించే భాషను
పెదాలపై దాచేస్తూ
నా మనసున నీ పాదాల పారాణి పెట్టేదేప్పుడు

మధుర క్షణాలు

***మధుర క్షణాలు***

మధుర క్షణాలు కొన్నే
జీవితంలో
నీ మనసుకి నచ్చిన వారిలో,
మెచ్చిన పనిలో

మిగిలినవి క్షణాలు కావు
రణాలు
జీవిత పయనంలో
సర్దుకుపోతూ నీకు నువ్వు సమర్ధించుకుంటూ ..@ బాటసారి...

Thursday 11 October 2012

మన సర్కారీ బడి

*** మన సర్కారీ బడి ***

మన సర్కారీ బడి
ఎందరో మేధావులకి అక్షర జ్ఞానాన్నిచ్చి
సమాజ నైతిక విలువలకి ఉగ్గుపాలు పట్టించి
గురువే దైవం అన్నగుడిలాంటి బడి ..!


నాటి బ్రతకలేక బడిపంతులు వినటానికి సామెతగా వున్నా
జీతాలివ్వక, రోజులు గడవక
ఎంతో మంది గురువుల అర్ధాకలి జీవితాలు
పచారి కొట్లలో చేసిన అప్పులు , తమ బిడ్డల్నేచదివించలేని పరిస్థితులు...!

ఆ జ్ఞాపకాల చీకటి రోజులకి ఎదురొడ్డి
అక్షర జ్ఞానాన్నిచ్చే కొవ్వొతై
ఎన్నో మట్టిలో మాణిక్యాలకు వెలుగైన
ఆ గురువులు, మన వూరి సర్కారీ బడులు ..!

నేటి కార్పోరేట్ స్ఖూల్స్ విపణికి
సర్కారీ వున్న నిధుల లేని లేమికి , చిన్న చూపుకి
ఎన్నో తమ ఉనికిని కోల్పోయి
మన బడులు పాడైన గుడిలో దీపం లేని దేవుడులయ్యే ...!

నేటి బతక నేర్చిన బడిపంతుళ్ళ జేబుల్లో
నెలసరి జీతాలు నిండుతున్నా ! ,
తిండి పెట్టేది సర్కారీ బడే అయినా
వారి పిల్లల చదువులు కార్పోరేట్ లోగిళ్ళల్లో ..!

చెప్పటానికి టీచర్లున్నా
ప్రభుత్వ పాటశాలలంటేనే చిన్నచూపై
బోసిబల్లలపై పిల్లలు కరువై
కొన్ని చోట్ల పేకాట రాయుళ్ళ కాలక్షేపానికి నెలవై ..!

మసక బోతోంది మనబడి
మనందరి బడి
మనవూరి బడి ,
సర్కారీ బడి ... @బాటసారి...

మౌన భాష

**నీ మౌన భాష***

నీ మౌన భాషకి రెండే అర్థాలు
ఒకటి
నేనంటే ఇష్టమని
రెండు
ఆ ఇష్టాన్ని నేనే నీతో చెప్పమని..!

నా కళ్ళు చూస్తున్నాయి
నీ కను పాపలో కదలాడే నీడ నాదేఅని


నీ ఊగే జడ చెపుతోంది
మనసున ఇష్టమని, చెప్పుట కష్టమని

నా ప్రతి ఉదయంలో
తొలికిరణం నీ రాక కోసమేనని

ఇస్తావా నీ మదివాకిట నాకింత చోటుని
నమ్ముతావా ఈ మనసంతా నువ్వేనని..! @ బాటసారి.

ఓ సాయంత్రం

ఓ సాయంత్రం
నిన్ను కలసిన ఆ చోట
జ్ఞాపకాల చినుకులు మనసుని గుచ్చుతుంటే
ఉండలేక మనసు పుస్తకం తెరిచానా !

మొదటి పేజి నీ నవ్వు, గుర్తొస్తోంది ..!

మీ ఇంటి పక్క

మల్లె తోటలో
బొండుమల్లి సిగలో తురుముతూ
ఎవరదీ అంటూ విసిరిన ఆ అరనవ్వు !

మళ్లీ నీ జ్ఞాపకాల దారుల్లో
మనిద్దరి జాడల కోసం
వద్దూ ..... అనుకుంటూనే ఇంకో పేజి
అదే నీతో చెప్పలేని ఆ మాట !

నీ కోసం
మీ అన్నయ్యతో చేసిన స్నేహం
వద్దంటున్నా మీ పెరట్లో తోటమాలి అవతారం
నువ్వు నాకు కావాలనే ఒక్క మాటకోసం

అప్పుడు వీలుకాక, ఇప్పుడు చెప్పాలన్నా నువ్వులేక,మనసు పుస్తకం రెప్పలు వాల్చుతూ @ బాటసారి...

నీ ఊహల్లో

బాటసారి *** నీ ఊహల్లో ***

నీలో ఏముందో
పెదాలు పలకని భావాలు
కళ్ళు చెప్పలేని ఊసులు
మనసు విప్పలేని బాసలు


అంతరంగం అందమైనదే
ఆవిష్కృతమయ్యే రూపమే
చిత్రంగా వుంది
మదిని ఛిద్రం చేస్తోంది...!

ఎదుట పడితే
ఎన్నడు చూడని బాటసారిలా
నా నీడను చూస్తూ
నన్ను గుచ్చే జ్ఞాపకంలా...

ఏంటోయ్ ఇది ! నీ ఊహలో
ఎన్నో సందెపొద్దులు,
వెన్నల రాత్రులు
దొర్లి పోతున్నాయ్...

నీ అడుగుల్లో అడుగేస్తూ
కళ్ళు రచించే భాషను
పెదాలపై దాచేస్తూ
నా మనసున నీ పాదాల పారాణి పెట్టేదేప్పుడు

వచ్చి పోవూ !

ఓయ్ వెన్నలా.....
ఒక్కసారి
నా మనసు వాకిట్లోకి
వచ్చి పోవూ !

వస్తూ వస్తూ...........


సంపెంగ లోని పరిమళాన్ని

చలి కౌగిలిలో విరబూసిన బొండుమల్లి గుభాలింపుని

ఏటిగట్టున గడ్డి పూల గుస గుస ను

గోదారి ఇసుక తెన్నెలపై ఆరబోసిన నీ సిగ్గును

మా వాకిట వసారాలో నులకమంచంపై అలసిన నా మరదలి సొగసును

నా కోసం తెచ్చి పోవూ .....@ బాటసారి

జ్ఞాపకాలు

నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నాయ్
వెంటాడుతున్నాయ్ ?
పదే పదే నీ జ్ఞాపకాలు
మరి మరి మనసుని గుచ్చే నీ చూపులు ..!

నువ్వు వద్దు అన్న ఆ క్షణం
మనస్సునే చీకటి చేసి
నీ ఉనికిని తుడిచేసి
నా కన్నీటి సంద్రంలో నైరాశ్యపు తీరాన్ని తాకాను

మళ్ళి ఓ ప్రేమ అల
నీ జ్ఞాపకాల నౌకని తీసుకొస్తూ
చుక్కాని నేనే నంటూ
నువ్వు రేపిన ప్రేమ గాయాన్ని మరువలేనంటూ

జ్ఞాపకానివా ? నా తీయటి మరణానివా ఎవరు నువ్వు ? @బాటసారి..

సంస్కారం

నమస్కారానికి
ప్రతినమస్కారం
సంస్కారం
...అన్నారు మన పెద్దలు, విజ్ఞులు

ఎప్పుడో అమ్మ చెప్పిన
చిన్న మాట
అహం బ్రహ్మ్మస్మి అంటూ
నేను అనే అహాన్ని వదిలి

కనీసం జన్మ నిచ్చిన తల్లితండ్రులకి
జ్ఞానాన్ని నేర్పే గురువుకి
నమస్క రించమని
రాబోయే తరాలకి కూడా ఇదే చెప్పమని,

ఊహ తెలిసిన నాటినుంచి
ఇదే
పెద్దలు నేర్పిన బాట
ఆచరించాం అవసరమైన్ ప్రతిచోట

కాలం మారింది
మా తరాన్ని తోసి రాజంటూ
యువతరం రానే వచ్చింది
ఆధునిక భావాలతో విహంగాలై దూసుకుపోతోంది !

మాట మాటకి ఓ ఇంగ్లీష్
పదాన్ని జోడించి
మాతృభాష మమకారాన్ని మరిచి
ఆంగ్ల వ్యాకరణానికి రంగులద్దుతోంది

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు
అన్న సామెతలా
పోనీలే వారే తెలుసుకుంటారు అనుకుంటే
నాకు మా తరం నేర్పిన సంస్కారం అడ్డోస్తోంది

ఆప్యాయంగా పిలవాల్సిన
అమ్మ నాన్నలను డాడి మామ్ లంటూ
పాదాభివందనం చెయ్యాల్సిన చోట
"లవ్ యు డాడ్ , మిస్ యు మామ్" అని హగ్స్ ఇస్తుంటే ..!

గురువుని గౌరవించడం అటుంచి
వీక్లీ ఫీడ్బాక్స్ అంటూ కార్పోరేట్ బడిలో
శిష్యులే కన్నెర్ర చేస్తుంటే
చేసేది లేదంటూ రాజీపడ్డ గురువుల్ని చూస్తుంటే..!

మా తరాన్ని చూసి మురిసి పోతూ
నేటి తరాన్ని చూసి కుమిలిపోతూ మీ బాటసారి ..

కవిత

బాటసారి ** నీ కనుల అందాన్ని**

లలితమైన నీ రూపాన్ని చూసి
తొలిసారి నే వ్రాసానో కవితని

...కవితంటే రాసాను కాని
నీ కనుల అందాన్ని వర్ణించడం కాలేదు నావల్ల

భావానికి పదాలు దొరకవు
పదాలకి అక్షరాలు చిక్కవు , పోల్చడమేలా ?

అవి కలువ రేకులా
పారిజాత సుమదళాలా !

ఇసుక తిన్నెలపై పడ్డ
పున్నమి వెన్నల దారులా !

మంచు పుష్పాన్ని తాకిన
రవికిరణం లోని ధవళ కాంతులా !

కావు కానేరవు...!

పాలపుంతలన్ని పోగు చేసి
ఆ విధాతే నీ నయనాలుగా చేసేనేమో !

విశ్వం లోని రంగులన్నీ ఏకంచేసి
ఆ రవివర్మ కుంచెకు జతచేర్చి గీసెనేమో !

పున్నమి వెన్నెలలో
ఇంద్రధనుస్సు వస్తే నీ కనుల అందానికి సరితూగునేమో !

వేచివున్నా

నువ్వొస్తావని
కాలానికి గాలం వేసి

ఆరు ఋతువుల్ని ఏకంచేసి
ప్రతి మాసంతో సావాసం చేసి

వసంతంలో చిగురులా
మాఘమాసంలో నవ వధువులా

సంక్రాంతి వాకిట ముగ్గులా

గ్రీష్మాన్ని ముద్దాడే వానచినుకులా

వేచివున్నా నీ తలపుల వాకిట
అలుపెరగని కడలి అలలా @బాటసారి...

కీచులాట

కులాల కీచులాట
ఆదినుండి
అనాదిగా
మనషుల మధ్యే చిత్రంగా !

యుగాలు మారినా
కులపిచ్చి చావదు !
తరాలు మారినా
వారసత్వం తరిగిపోదు . .

ఎప్పుడు తెలుసుకుంటాం
వున్నది ఒకటే జాతని
మంచి చెడు అనే
ఇద్దరే వ్యక్తులని ..!

ఉన్నోడు లేనోడు
అన్న రెండే కులాలని..
కులాల కీచులాట మనకు తప్ప
మరే జాతికి లేదని !

నీ కష్టంలో
ఆపన్న హస్తం ఇచ్చేవాడు
ఏకులమైతే ఏంటి
ఏ మతమైతే ఒరిగేదేంటి ?

ఎందుకూ పనికిరావ్
ఒక పెళ్ళికి
చావుకి తప్ప
నీ లోని కులగజ్జి కి మతం మందు పూయడానికి తప్ప

మనిషిని మనిషిగా చూద్దాం
మంచిని పెంచుదాం
వీలయితే సాయం చేద్దాం
కులంలేని సమాజాన్ని సృష్టిద్దాం @ బాటసారి ...

మనవి

నీ నవ్వుల్లో ఉదఇస్తాను
మలిసందెల నీ మౌనం లో అస్తమిస్తాను
పువ్వుని కాదు
తిరిగే భూమిని కాదు

ఓ ప్రేమ పిపాసిని
రెండక్షరాల నా ప్రేమని
నీ మనసు పుస్తకంపై
క్షణమైనా చూడమని మనవి వినమని @బాటసారి

తొలి

తోలి ప్రేమకు తొందరెక్కువ
తొలిచూపు చెప్పే
ప్రేమ బాసలు మనసు వాకిట్లో
బంధీ చెయ్యాలని

ఆకళ్ళు రేపే
ప్రియురాలి తోలి సిగ్గులు
లిపే లేని ప్రేమ సైగలతో
మాటల ముగ్గు వెయ్యాలని @ బాటసారి

క్షణాలు

మధుర క్షణాలు కొన్నే
జీవితంలో
నీ మనసుకి నచ్చిన వారిలో
నీ మనసుకి నచ్చిన పనిలో

మిగిలినవి క్షణాలు కావు
రణాలు
జీవిత పయనంలో
సర్దుకుపోతూ నీకు నువ్వు సమర్ధించుకుంటూ ..@ బాటసారి...

జీవితం

కల
నిజమూ అవ్వచ్చు
కల్పనే గానే కను రెప్పల మధ్య
కరిగి పోవచ్చు

జీవితం
కధ కాదు, కల్పనకు తావు లేదు
ఓ నిజం, నదీ ప్రవాహం
సాగుతూనే వుండాలి , నిన్ను నువ్వు తెలుసుకుంటూ ..@ బాటసారి

బాటసారి

నీ లక్షం వైపు సాగిపో
బంధాలకు అనుబంధాలకు బంధీకాకు
ఒక్కడివే వచ్చావ్
ఒంటరిగానే వెళతావ్ ...@బాటసారి