Thursday 11 October 2012

సంస్కారం

నమస్కారానికి
ప్రతినమస్కారం
సంస్కారం
...అన్నారు మన పెద్దలు, విజ్ఞులు

ఎప్పుడో అమ్మ చెప్పిన
చిన్న మాట
అహం బ్రహ్మ్మస్మి అంటూ
నేను అనే అహాన్ని వదిలి

కనీసం జన్మ నిచ్చిన తల్లితండ్రులకి
జ్ఞానాన్ని నేర్పే గురువుకి
నమస్క రించమని
రాబోయే తరాలకి కూడా ఇదే చెప్పమని,

ఊహ తెలిసిన నాటినుంచి
ఇదే
పెద్దలు నేర్పిన బాట
ఆచరించాం అవసరమైన్ ప్రతిచోట

కాలం మారింది
మా తరాన్ని తోసి రాజంటూ
యువతరం రానే వచ్చింది
ఆధునిక భావాలతో విహంగాలై దూసుకుపోతోంది !

మాట మాటకి ఓ ఇంగ్లీష్
పదాన్ని జోడించి
మాతృభాష మమకారాన్ని మరిచి
ఆంగ్ల వ్యాకరణానికి రంగులద్దుతోంది

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు
అన్న సామెతలా
పోనీలే వారే తెలుసుకుంటారు అనుకుంటే
నాకు మా తరం నేర్పిన సంస్కారం అడ్డోస్తోంది

ఆప్యాయంగా పిలవాల్సిన
అమ్మ నాన్నలను డాడి మామ్ లంటూ
పాదాభివందనం చెయ్యాల్సిన చోట
"లవ్ యు డాడ్ , మిస్ యు మామ్" అని హగ్స్ ఇస్తుంటే ..!

గురువుని గౌరవించడం అటుంచి
వీక్లీ ఫీడ్బాక్స్ అంటూ కార్పోరేట్ బడిలో
శిష్యులే కన్నెర్ర చేస్తుంటే
చేసేది లేదంటూ రాజీపడ్డ గురువుల్ని చూస్తుంటే..!

మా తరాన్ని చూసి మురిసి పోతూ
నేటి తరాన్ని చూసి కుమిలిపోతూ మీ బాటసారి ..

No comments:

Post a Comment