Thursday 11 October 2012

మన సర్కారీ బడి

*** మన సర్కారీ బడి ***

మన సర్కారీ బడి
ఎందరో మేధావులకి అక్షర జ్ఞానాన్నిచ్చి
సమాజ నైతిక విలువలకి ఉగ్గుపాలు పట్టించి
గురువే దైవం అన్నగుడిలాంటి బడి ..!


నాటి బ్రతకలేక బడిపంతులు వినటానికి సామెతగా వున్నా
జీతాలివ్వక, రోజులు గడవక
ఎంతో మంది గురువుల అర్ధాకలి జీవితాలు
పచారి కొట్లలో చేసిన అప్పులు , తమ బిడ్డల్నేచదివించలేని పరిస్థితులు...!

ఆ జ్ఞాపకాల చీకటి రోజులకి ఎదురొడ్డి
అక్షర జ్ఞానాన్నిచ్చే కొవ్వొతై
ఎన్నో మట్టిలో మాణిక్యాలకు వెలుగైన
ఆ గురువులు, మన వూరి సర్కారీ బడులు ..!

నేటి కార్పోరేట్ స్ఖూల్స్ విపణికి
సర్కారీ వున్న నిధుల లేని లేమికి , చిన్న చూపుకి
ఎన్నో తమ ఉనికిని కోల్పోయి
మన బడులు పాడైన గుడిలో దీపం లేని దేవుడులయ్యే ...!

నేటి బతక నేర్చిన బడిపంతుళ్ళ జేబుల్లో
నెలసరి జీతాలు నిండుతున్నా ! ,
తిండి పెట్టేది సర్కారీ బడే అయినా
వారి పిల్లల చదువులు కార్పోరేట్ లోగిళ్ళల్లో ..!

చెప్పటానికి టీచర్లున్నా
ప్రభుత్వ పాటశాలలంటేనే చిన్నచూపై
బోసిబల్లలపై పిల్లలు కరువై
కొన్ని చోట్ల పేకాట రాయుళ్ళ కాలక్షేపానికి నెలవై ..!

మసక బోతోంది మనబడి
మనందరి బడి
మనవూరి బడి ,
సర్కారీ బడి ... @బాటసారి...

No comments:

Post a Comment